Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2017 15:01:54
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతికే రావల్సిన సినిమా గురు. వెంకటేష్ మెరుపు వేగంతో ఆ సినిమాని చేసేశాడు. అప్పటికప్పుడు జిమ్ కి వెళ్లి కండలు కరిగించుకొని మరీ కెమెరా ముందుకొచ్చాడు. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ... ఆ సినిమా సంక్రాంతికి రాలేదు. ఆ తర్వాత నెలైనా వస్తుందనుకొంటే వెంకీ మాత్రం సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే సమ్మర్కి వచ్చే సినిమాల హడావుడి కూడా ఇటీవల మొదలైపోయింది. కానీ గురు సందడి మాత్రం షురూ కాలేదేంటా అని వెంకీ అభిమానులు ఆశ్చర్యపోతూ ఎదురు చూస్తున్నారు.

వాళ్లని ఇంకా వెయిట్ చేయించడం సరికాదనుకొన్నాడో ఏంటో తెలియదు కానీ.. వెంకీ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం పెట్టేశాడు. ఈ నెల 20న గురు ట్రైలర్ విడుదల కాబోతోంది. సినిమా ఎప్పుడన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే ట్రైలర్ విడుదలవుతోంది కాబట్టి త్వరలోనే సినిమా కూడా బయటికొచ్చే అవకాశాలున్నాయి. కాటమరాయుడుకీ బాహుబలికీ మధ్యనున్న ఓ గ్యాప్ ని చూసుకొని చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉంది గురు టీమ్. ఇందులో వెంకీ బాక్సింగ్ గురు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాటలు - టీజర్లు బయటికొచ్చాయి. వాటికి మంచి స్పందనే లభించింది. ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి

,  ,  ,  ,  ,  ,  ,