Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 09:36:09
facebook Twitter Googleplus
Photo

సంగీత దర్శకుడు తమన్ కు క్రికెట్ అంటే పిచ్చి అన్న సంగతి తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ వస్తోందంటే.. పనులన్నీ మానేసి టీవీ ముందు అతుక్కుపోతాడతను. కేవలం మ్యాచులు చూడటమే కాదు.. ఆడటం కూడా తమన్ కు చాలా ఇష్టం. టాలీవుడ్లోని తన స్నేహితులతో కలిసి తరచుగా క్రికెట్ మ్యాచులు ఆడుతుంటాడు తమన్. కొన్నిసార్లు మ్యాచుల కోసమే చెన్నై నుంచి ఫ్లైటెక్కి.. హైదరాబాద్ వస్తుంటాడని.. తన వెంట క్రికెట్ కిట్ పట్టుకుని తిరుగుతుంటాడని సన్నిహితులు చెబుతుంటారు. టాలీవుడ్లో తమన్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన హరీష్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్ క్రికెట్ పిచ్చి గురించి మాట్లాడాడు.

తమన్ క్రికెట్ గ్రౌండ్లో తన లాంటి దర్శకుల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడని అతను చెప్పాడు. తమన్ బ్యాటింగ్ చేసేటపుడు స్లోగా బంతులు వేయాలని.. బౌండరీలు బాదేలా సహకరించాలని.. ఔటైనా నాటౌట్ అని ఒప్పుకోవాలని.. ఇలా చాలా కండిషన్లు ఉంటాయని హరీష్ అన్నాడు. ఇలా చేయకపోతే సరైన ట్యూన్ ఇవ్వనని బెదిరిస్తాడని.. తాము కూడా భయపడి అతడికి సహకారం అందిస్తుంటామని హరీష్ చమత్కరించడం విశేషం. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఒక మైదానంలో టాలీవుడ్ సెలబ్రెటీలతో కలిసి రాత్రి పూట తమన్ మ్యాచులు ఆడుతుంటాడట.

,  ,  ,  ,