Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2017 10:47:38
facebook Twitter Googleplus
Photo

దువ్వాడ జగన్నాధం సేఫ్ జోన్ లోకి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే అదనుగా సమయం చూసుకుని మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్న కోరికను బయటకు చెప్పేశాడు హరీష్ శంకర్.

తెలుగు సినిమాలు చేసే ఏ దర్శకుడికి అయినా.. చిరంజీవితో సినిమా చేయడం అనేది ఒక డ్రీమ్. హరీష్ కూడా ఆ దిశగా ఓ ప్రయత్నం చేశాడు. నిజానికి.. హరీష్ శంకర్ తో తాను సినిమా చేయాలని అనుకుంటున్నట్లు ఐదేళ్ల క్రితం గబ్బర్ సింగ్ సమయంలోనే చెప్పారు మెగాస్టార్. కానీ చిరు మాత్రం తను వచ్చిన ప్రతీ ఫంక్షన్ లోను ఇలాగే చెబుతుంటారు. బోయపాటి శ్రీనుకు కూడా ఇలాగే ఓ టైంలో మాటిచ్చారు. ఇక పూరీ జగన్నాధ్ సంగతి చెప్పనక్కర్లేదు. చిరు వీరాభిమానిగా.. మెగాస్టార్ రీఎంట్రీ మూవీని ఈయనే తీయాల్సి ఉన్నా.. స్టోరీలో లోటుపాట్లంటూ చిన్న మనస్ఫర్ధలతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

ఇప్పుడు హరీష్ శంకర్ చిరుతో సినిమా చేసేందుకు రెడీ అంటూ.. స్టోరీ సిద్ధంగా ఉందని చెప్పినా.. ఇప్పుడు ఉయ్యాలవాడ చేస్తున్న చిరంజీవి.. ఆ తర్వాత బోయపాటికి కమిట్మెంట్ ఇచ్చారు. అప్పటి వరకూ చిరు స్టోరీని హరీష్ శంకర్ అలాగే ఉంచుతాడో లేక వేరే ఎవరితో అయినా ప్రొసీడ్ అయిపోతాడో చూడాలి

,  ,  ,  ,  ,