Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 12:08:11
facebook Twitter Googleplus
Photo

హ్యాట్రిక్ హిట్స్‌తో వచ్చిన జోరును శంకరాభరణం తో అందుకోలేకపోయిన నిఖిల్, తాజాగా చాలా జాగ్రత్తలు తీసుకొని, తనకు బాగా కలిసివచ్చిన ప్రయోగాన్నే నమ్ముకొని ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, అంతా అనుకున్నట్టుగానే సరికొత్త కాన్సెప్ట్‌తో, అదిరిపోయే కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో దేశమంతా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిన ఈరోజుల్లోనూ ఎక్కడికి పోతావు చిన్నవాడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‍గా నిలబడడం విశేషంగా చెప్పుకోవాలి.
ఇక ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే, యూఎస్‌లోనూ టాక్ బాగుండడంతో కలెక్షన్స్ జోరు మీదున్నాయి. గురువారం ప్రీమియర్స్, శుక్ర, శనివారాలు కలుపుకొని యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 282కే డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమాకు జరిగిన బిజినెస్‌ను బట్టి చూస్తే ఇది సూపర్ ఓపెనింగ్ అనే చెప్పుకోవాలి. ఆదివారం రోజున కలెక్షన్స్ మరింత బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిఖిల్ కెరీర్లోనే అతిపెద్ద రిలీజ్‌గా నిలిచిన ఎక్కడికి పోతావు చిన్నవాడాను దర్శకుడు వీఐ ఆనంద్ తెరకెక్కించారు. నిఖిల్ సరసన నందిత శ్వేత, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,  ,