Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2016 12:41:36
facebook Twitter Googleplus
Photo

గబ్బర్ సింగ్ తో స్టార్ డైరెక్టర్ అయిపోయిన హరీష్ శంకర్.. అంతే స్పీడ్ గా కిందకొచ్చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన రామయ్యా వస్తావయ్యా.. హరీష్ స్థాయిని నేలపైకి తెచ్చేసింది. ఆ తర్వాత చాలా బ్యాలెన్సింగ్ గా సాయిధరం తేజ్ తో సినిమా చేశాడు హరీష్ శంకర్.

సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ మెగా ఫ్యామిలీ హీరోతో గతేడాది చేసిన చిత్రం హిట్ అనిపించుకుంది. అయితే.. ఆ తర్వాత మాత్రం ఈ డైరెక్టర్ కి ఆఫర్లు రాలేదు. చిన్న హీరోలతో సినిమాలు చేసేందుకు హరీష్ శంకర్ సుముఖంగా లేకపోవడం.. పెద్ద హీరోలు ప్రస్తుతం తమ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో.. హరీష్ శంకర్ కి ఆఫర్స్ రావడం లేదు. చిరంజీవితో కానీ అల్లు అర్జున్ తో కానీ సినిమా చేయాలన్నది ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఆలోచన.

ప్రస్తుతానికి దర్శకత్వం వహించే ఛాన్స్ లేకపోవడంతో.. హరీష్ శంకర్ నిర్మాతగా మారేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. చిన్న హీరోలను తీసుకుని ఇతర డైరెక్టర్లతో సినిమాలు చేయించేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే సాయిధరం తేజ్ తో బీవీఎస్ రవి తీస్తున్న చిత్రానికి.. హరీష్ శంకర్ సహ నిర్మాత అనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,