Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jun-2016 17:04:58
facebook Twitter Googleplus
Photo

జూ.ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరక్టర్ కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా ''జనతా గ్యారేజ్''. ఈ ఏడాది సంక్రాంతికి ''నాన్నకు ప్రేమతో'' సినిమాను రిలీజ్ చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమా రిలీజైన రెండు రోజులకే తన కొత్త సినిమా కథలు మొదలెట్టేశాడు. వెంటనే షూటింగులోకి దూకేశాడు. ఆగస్టు 12న రిలీజ్ అని కూడా ప్రకటించేశాడు.

ఇక లేటెస్టు న్యూస్ ఏంటంటే.. ఈ డేట్ లో ఎటువంటి తేడా ఉండదు. ఎందుకంటే దాదాపు టాకీ పార్టు అంతా దాదాపు పూర్తయిపోయింది. మరో వారం షూట్ చేస్తే టాకీ మొత్తం ఫినిష్ అయిపోతుంది అంతే. ఇప్పటికే పాటలు కూడా షూటింగ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ రెండు పాటల చిత్రీకరణ పూర్తయ్యింది. చూస్తుంటే అనుకున్న టైమ్ కంటే ముందే కొరటాల శివ సినిమాను పూర్తి చేసి ఫస్ట్ కాపీ చేతిలో పెట్టేశేలా ఉన్నాడు. ఇదంతా కేవలం అతి తక్కువగా మూడు నెలల స్పాన్ లో చేసేశాడు. వావ్ అని అనుకోవాల్సిందే.

''జనతా గ్యారేజ్'' సినిమాతో 50 కోట్ల క్లబ్ లోకి మరోసారి చేరితే మాత్రం.. ఎన్టీఆర్ కూడా ఇక రికార్డుల వేట మొదలెట్టినట్లే. ఒకవేళ 60 కోట్ల క్లబ్ లోకి పడితే మాత్రం.. ఆ లెక్క వేరేలా ఉంటుంది

,  ,  ,  ,  ,  ,