Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2017 15:11:45
facebook Twitter Googleplus
Photo

దిల్ రాజుకి బాగా దగ్గరైన డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ తర్వాత దువ్వడా జగన్నాథమ్ సినిమాతో మరింత దగ్గరయ్యడు. కానీ డీజే పైకి బాక్స్ ఆఫీస్ ను దున్నేసిందని చెప్పినా నిజంగానే దిల్ రాజుకు లాభాలు వచ్చినా ఫైనల్ గా అపజయాన్ని మూటగట్టుకొని హరీశ్ కు చెప్పుకోలేని నిరాశనే మిగిల్చింది. అయితే ప్రస్తుతం హరీష్ ఏం మాయ చేశాడో గాని మళ్లీ దిల్ రాజుకి కథ చెప్పి మెప్పించాడు.

ఈ సారి కాస్త కొత్తగా ఓ మినీ మల్టీ స్టారర్ ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ కథకి దాగుడు మూతలు అని టైటిల్ కూడా దిల్ రాజు అప్పుడే రిజిస్ట్రేషన్ చేసేసాడు. అయితే మొదట హరీష్ ఈ కథను మెగా రైజింగ్ హీరోస్ అయిన సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ కి చెప్పాడు కానీ వారు బిజీ షెడ్యూల్ కారణంగా సినిమాను ఒకే చేయలేదట. దాంతో రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ తో మరియు న్యాచురల్ స్టార్ నానితో సెట్ చేద్దామని అంతా ప్లాన్ చేసుకున్నాడట. కానీ వారిద్దరికీ ఈ కాంబినేషన్ అస్సలు నచ్చడం లేదనే టాక్ వినిపిస్తోంది.

అల్ రెడీ నాని మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. పైగా రెండు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక విజయ్ అర్జున్ రెడ్డి తో మంచి హిట్ అందుకున్నాడు. అదే తరహాలో వెళుతూ తనకంటూ ఓ స్టాన్డెర్డ్ మార్కెట్ ను సెట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అలాంటిది ఈ టైమ్ లో మల్టీ స్టారర్ అంత మంచిది కాదని డిసైడ్ అయ్యాడట. సో మొత్తానికి ఈ యువ హీరోలు హరీష్ శంకర్ స్క్రిప్ట్ కి అయితే ఒకే చెప్పే పరిస్థితుల్లో లేరని తెలుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే వారిద్దరికీ కొంచెం ఈగో క్లాషెస్ అయినట్టే కనబడుతోంది.

,  ,  ,  ,  ,