Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2015 18:08:26
facebook Twitter Googleplus
Photo

సినిమా అన్నాక స్టార్స్ ఉంటారు అలాగే కేరక్టర్ ఆర్టిస్టులూ ఉంటారు. పిక్చర్ అన్నాక ప్రమోషన్ ఉంటుంది. మరి రెండింటినీ మిక్స్ చేయడం అంటే ఏంటో తెలియాలంటే సర్దార్ గబ్బర్ సింగ్ స్టైల్ చూడాల్సిందే. ఎందుకంటే ఈ మూవీకి ప్రచారం చేస్తున్న తీరు విభిన్నంగా ఉంది. సాధారణంగా సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్స్ ఇస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కి.. షూటింగ్ ఎలా జరుగుతోంది ఎంతవరకు వచ్చింది లాంటి విషయాలు ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. జస్ట్ పిక్చరైజేషన్ మాత్రం జరుగుతోంది అని తెలుసు.

మరి ఇలాంటప్పుడు పబ్లిసిటీకి ఏం చేయాలి.. దీనికో కొత్త స్కెచ్ వేశారు యూనిట్. సర్దార్ కి సంబంధించి నటీనటులనే హై లెవెల్ న్యూస్ రేంజ్ లో లీక్ చేస్తున్నారు. రాయ్ లక్ష్మీ పేరు చెప్పి దాదాపు ఓ నెల రోజులు ప్రచారం లాగించేశారు. ఐటెం సాంగ్ అనీ కొన్ని కీలక సన్నివేశాలు అని తెగ ఊదరగొట్టేశారు. తన శాయశక్తులా ఓ నెల్లాళ్లు ప్రచార భారం మోసింది ఆ భామ. ఇప్పుడు మళ్లీ బుజ్జిగాడు ఫేం సంజన ఎంట్రీ ఇచ్చింది. ఓవైపు కాజల్ హీరోయిన్ - మరోవైపు ఐటెం గాళ్ కం కేరక్టర్ రాయ్ లక్ష్మీ ఉండగా.. ఈ సంజన కేరక్టర్ ఎంత పెద్దది ఉంటుందో చెప్పలేం కానీ.. ఇప్పుడు పబ్లిసిటీ వంతు సంజనది. అంతే కాదు.. గుజరాత్ లో షూటింగ్ పేరు చెప్పి రెండు మూడు ఫోటోలు మాత్రం రిలీజ్ చేసి రెండు వారాల పాటు ప్రమోషన్ చేశారు నిర్మాత శరత్ మరార్. ఇదంతా ఆయన పాటిస్తున్న కార్పొరేట్ స్టయిల్ అని అనుకుంటున్నారు చాలామంది.

అయితేనేం.. ఏ సంగతీ చెప్పుకుండా ఏదో జరిగిపోతోందనే ఫీలింగ్ కలిగించడంలో మాత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త స్టయిల్ ఫాలో అయిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇంత డిఫరెంట్ ప్రమోషన్ ఇదే మొదటిసారి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కాకపోతే మూవీ రిలీజ్ కి దాదాపు ఆరు నెలల సమయం ఉండడంతో.. ఇలాంటి ట్రిక్కులు మరెన్ని చూడాలో అనుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.

,  ,  ,