Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2015 13:18:09
facebook Twitter Googleplus
Photo

ఇంతకీ సేల్ బాగానే చేశాడని పేరొచ్చాక అసలు సేల్స్ మ్యాన్ ఏమైపోయినట్లు? అర్ధం కాలేదా... అదేనండి.. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' తీసిన హరీశ్ శంకర్ అసలు ఎక్కడున్నాడు. మనోడు ఈ మధ్యనే ఒక మాంచి హిట్ కొట్టాడులే అనుకుంటే.. సినిమా క్లోజింగ్ ఫిగర్ల ద్వారా మాత్రం బాక్సాఫీస్ దగ్గర కొందరు పంపిణీదారులకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయ్ అంటూ వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు హరీశ్ సంగతేంటి?

ఆ మధ్యన బన్నీ ఫోన్ చేసి.. సుబ్రమణ్యం సినిమాను రఫ్ఫాడించావ్ అంటూ కితాబిచ్చాడని స్వయంగా హరీశే తెలిపాడు. కాబట్టి అందరూ మనోడు బన్నీతో తన తదుపరి సినిమాను చేస్తాడేమో అనుకున్నాం. కాని చూస్తే.. అక్కడ వర్కవుట్ అయినట్లు లేదు. ఇకపోతే ఎలాగో రవితేజ ఉన్నాడు.. మనోడు ఇప్పుడు హరీశ్ కు తదుపరి సినిమా ఇస్తున్నాడనే న్యూస్ వచ్చింది. కాని ఇన్సైడర్లు చెబుతోంది ఏంటంటే.. మనోడు నిర్మాత దిల్ రాజుతో ఇంకో సినిమా చేయాలట. రామయ్య వస్తావయ్యా - సుబ్రమణ్యం ఫర్ సేల్ తరువాత మూడో సినిమా చేయడానికి కూడా ఆల్రెడీ ఎగ్రిమెంటు చేసుకున్నాడని తెలుస్తోంది. సో.. ఈ కొత్త సినిమా ఎవరితో ఎప్పుడు చేస్తున్నాడు మాత్రం తెలియదు.

,  ,  ,