Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2017 10:45:48
facebook Twitter Googleplus
Photo

మనోజ్ కొన్ని నెలల కిందట తాను సినిమాలు మానేస్తున్నట్లు.. ఒక్కడు మిగిలాడు యే తన చివరి సినిమా అన్నట్లు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అది నిజంగా పెట్టాడా.. తమాషాకా అన్నది తెలియలేదు. తర్వాత అలాంటిదేమీ లేదని చెప్పాడు మనోజ్. ఐతే తాజాగా ఒక్కడు మిగిలాడు ప్రి రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఆ ట్వీట్ వెనుక దాగున్న అసలు సంగతి వివరంగా చెప్పాడు మనోజ్. తాను అప్పుడు సినిమాలు మానేద్దామని అనుకున్న మాట వాస్తవమే అని అతను వెల్లడించాడు. ఇందుకు కారణాలేంటో అతను వివరించాడు.

ఈ రోజుల్లో మనిషికి మనిషి సాయం చేసే అలవాటు పోతోంది. అందరూ ఫోన్లు.. గాడ్జెట్స్ పట్టుకుని ఉంటున్నారు. మనిషితో మనిషి మాట్లాడట్లేదు. టెక్నాలజీ అవసరమే. ఎవాల్వ్ కావాల్సిందే. కానీ మనిషిని మరిచిపోకూడదు. సాటి మనిషికి సాయం చేసే అలవాటు వదులుకోకూడదు. నాకు మా నాన్న చిన్నప్పట్నుంచి ఒకటే చెబుతున్నారు. ఎదుటి వాడికి వీలైతే సాయం చేయి. కానీ ఎవడి పొట్టా కొట్టద్దు అని. నేను అదే చేస్తున్నారు. దేవుడు నాకిచ్చిందాంతో నేను చాలా మందిని చదివిస్తున్నాను. నా కూడా ఉన్న వాళ్లను చూసుకుంటున్నా. వారి పిల్లల్ని చదివిస్తున్నా. దేవుడిచ్చే కొద్దీ ఇలాగే చేసుకుంటూ వెళ్తాను. నాకు ఇంకా ఎంతో చేయాలని తపన. వైజాగ్ లో హుద్ హుద్ వచ్చినపుడు కానీ.. చెన్నైలో వరదలప్పుడు కానీ.. నేను చేయగలిగిందంతా చేశాను. ఎంత సంపాదిస్తే ఏముంది.. ఎవరికీ సాయం చేయకుండా. అందుకే రైతుల్ని ఆదుకోవాలనిపించింది. సినిమాల ద్వారా నేను సంపాదించినదాంట్లో పది శాతం వాళ్లకు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అది జరుగుతోంది. ఇంకా కూడా సాయం చేస్తా.

ఐతే ఒక్కడు మిగిలాడు సినిమా చేస్తున్నపుడు దర్శకుడు శ్రీలంకలో తమిళుల కష్టాలకు సంబంధించిన ఫొటోలు.. న్యూస్ కటింగ్స్.. వీడియోలు ఇచ్చాడు. అవి చూసి కదిలిపోయా. నాలో ఆలోచన మొదలైంది. మన చుట్టూ ఏం జరుగుతోందో చూద్దాం అని చూస్తే పెద్దోళ్లు చిన్నోళ్లను తొక్కుతున్నారు. అన్ని చోట్లా అది ఉంది. మరోవైపు రైతులు కష్టాలు పడుతున్నారు. ఇదంతా చూశాక మనం పూర్తిగా ఇందులోకి దిగాలని.. ఏదో చేయాలని అనిపించింది. అందుకే సినిమాలు మానేసి జనాల్లోకి వెళ్లిపోవాలనుకున్నా. అందుకే ఆ రోజు అలా ట్వీట్ చేశా. నా గురించి నాన్నకు తెలియడం వల్ల ఆయనేమీ అనలేదు. కానీ అది చూసి మా అన్నయ్య నన్ను ఒక్క తన్ను తన్నాడు. మేమందరం ఉండగా ఏంట్రా నీ సొంత డెసిషన్లు అన్నాడు. నువ్వు చేయాలనుకున్నది మంచిదే కానీ.. దానికో టైం వస్తుంది. ఈ లోపు సినిమాల ద్వారా సంపాదించు. అందులోంచి వారికి సాయం చేస్తూ ఉండు. తర్వాత మంచి టైం చూసి పూర్తిగా దిగు అని చెప్పాడు. దీంతో నేను ఆలోచించి నా నిర్ణయం మానుకున్నాను. నాకు సినిమాలు తప్ప ఇంకేమీ తెలియదు. ఇక్కడే ఉండాలి. ఐతే ఏదో ఒక రోజు నేను పూర్తిగా సర్వీస్ లోకి దిగడం ఖాయం. ఆ రోజు అందరి లెక్కలు తీస్తా. మా సినీ పరిశ్రమలో కూడా పెద్దోళ్లు చిన్నోళ్లను తొక్కుతున్నారు. చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవడం చాలా కష్టమైపోతోంది. ఐతే ఎవరు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నా. అందరినీ నోట్ చేసుకుంటున్నారు. నేను దిగిన రోజు అందరినీ ప్రశ్నిస్తా.

,  ,  ,  ,  ,