Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 11:28:11
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ సినిమాకి పనిచేసే అవకాశం వస్తే... ఏ టెక్నీషియన్ అయినా ఏమి చేస్తారు? సాదారణంగా.. ఎగిరి గంతేస్తారనే సమాధానం ఇండస్ట్రీలో వినిపించొచ్చు. కానీ... ఆ అవకాశాన్ని తిరస్కరించాడు యాక్టర్ కం రైటర్ హర్షవర్ధన్! అలా ఎందుకు చేశాడు.. పవన్ సినిమాలో అవకాశాన్ని ఎందుకు కాదన్నాడు.. అని ఏవేవో ఊహించుకోవద్దు! దీనికి మరోటో ఇంకోటో కారణం కాదంట... కేవలం ఆయన దర్శకత్వ కలే ఇందుకు కారణం.

మెగా ఫోన్ పట్టాలని గత రెండేళ్లుగా తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలించిన సమయం ఆసన్నమయిన వేల.. మరో అదృష్టం తలుపుతట్టింది హర్షవర్ధన్ కు. అదే... "కాటమరాయుడు" తర్వాత పవన్ చేయబోయే సినిమాకి మాటలు రాయమని. తమిళ హిట్ మూవీ "వేదాలం"కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి ఇప్పటికే ప్రారంభోత్సవం కూడా జరిగింది. అయితే ఈ సినిమాకి మాటలు రాసే అవకాశం హర్ష కు వచ్చిందట. ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిన హర్ష... తన దర్శకత్వ కల వాయిదా పడిపోతుందని భావించే ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడట.

ఆ సంగతులు అలా ఉంటే... తానుకూడా ఒక కీలకపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యపాత్ర పోషిస్తుంది. మరో విషయం ఏమిటంటే... ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే... సుధీర్ బాబు హీరోగా మరో అవకాశం హర్షకు దర్శకుడిగా రావడం. కాగా... ఇష్క్ గుండెజారి గల్లంతయ్యిందే మనం వంటి సినిమాలతో హర్ష వర్ధన్ రచయితగా మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే!

,  ,  ,  ,  ,  ,