Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 14:19:32
facebook Twitter Googleplus
Photo

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కు జోడిగా కనిపించిన కాజల్?సినిమా ఫ్లాఫ్ అయినా వరస పెట్టి ఆఫర్స్ అందుకుంటోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆమెను బాలకృష్ణ ప్రెస్టేజియస్ గా భావించి చేస్తున్న వందో చిత్రం కోసం అడిగినట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం ఆమెను రాణి పాత్రకు అడిగినట్లు తెలుస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ణి ?సహ ధర్మ చారిణిగా ఆమె కనిపిస్తే బావుంటుందని భావించారట. అయితే కాజల్ మాత్రం రిజెక్టు చేసిందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం?తనను లక్ష్మి కళ్యాణం చిత్రంతో పరిచయం చేసిన తేజపై ఉన్న గౌరవంతో అని చెప్పుకుంటున్నారు. తేజ, రానా కాంబినేషన్ లో సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ చిత్రం ప్రారంభం కాబోతోందని, అందుకోసం ఆమె డేట్స్ అడిగారని వినపడుతోంది. దాంతో ఇప్పుడు మళ్లీ క్రిష్ కు సమస్య మొదటికి వచ్చిందని, బాలయ్య సరసన నయనతార ని అడగాలా అనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. బాలయ్య సైతం కాజల్ అనగానే ఉత్సాహం చూపించారని, ఫెరఫెక్ట్ గా రాణి పాత్రకు సూట్ అవుతుందని భావించారని, ఇప్పుడు మరొకరిని ఫొటో షూట్ చేసి ఓకే చేయాలని వినికిడి. మరి ఎవరిని ఆ అవకాసం వరిస్తుందో చూడాలి.

,  ,  ,  ,  ,