Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2016 11:36:53
facebook Twitter Googleplus
Photo

కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించిన హీరోయిన్ హేబా పటేల్. అందంతో పాటు తన బోల్డ్ యాక్టింగ్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటి. ఆ ఇమేజే ఇప్పుడు ఈ అమ్మడికి వరుస అవకాశాలను తెచ్చిపెడుతుంది. స్టార్ హీరోయిన్లు కాదన్న ఛాన్స్లు కూడా హేబా తలుపు తడుతున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కాదన్న ఓ క్రేజీ ఆఫర్ను కొట్టేసింది హేబా.

ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మిస్టర్ సినిమాలోనటిస్తుంది హేబా. ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా లైన్లో ఉండగానే మరో మెగా హీరో నుంచి పిలుపు వచ్చింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు రకుల్ ప్రీత్ను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు. అయితే మహేష్ బాబు సినిమా కోసం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది రకుల్. దీంతో ఈ సినిమాలో హేబా పటేల్ హీరోయిన్గా తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

,  ,  ,  ,  ,