Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2017 11:28:00
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఒకటే బాటలో వెళుతున్నారు. ముఖ్యంగా తెలుగు స్టార్లు అయితే.. ఏ క్లారిటీ అయినా కూడా ట్విట్టర్ ద్వారా ఇచ్చేస్తున్నారు. ఒకప్పటి తరహాలో మేనజర్ల ద్వారానో పి.ఆర్.ఓ ద్వారానో మీడియాకు స్టేట్మెంట్లు రిలీజ్ చేయడం వంటివి చేయట్లేదు. ఈ మధ్యన ప్రొడ్యసర్లకు స్టార్ హీరోలు ఇస్తున్న ట్వీట్ క్లారిటీలు చూస్తే మాత్రం ఔరా అనాల్సిందే.

మొన్నటికి మొన్న నాగార్జునతో 'మనం' తరహా తీయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు కూడా చాలా హింట్లే ఇచ్చారు. రైటర్ సతీష్ వేగేశ్న అందించిన ఒక కథతో నాగ్ అండ్ చైతన్య కలసి నటిస్తారనేది ఈ చిన్న చిన్న హింట్లతో తయారైన పెద్ద న్యూస్ సారాంశం కాగా.. నిన్న ఉదయాన్నే ఈ సినిమా ఏంటో నాకు తెలియదు ఇది నాకు కూడా కొత్త న్యూసే అంటూ నాగ్ క్లారిటీ ఇచ్చారు. అంతకంటే పెద్ద విషయం ఏంటంటే.. ట్విట్టర్ ద్వారా దిల్ రాజుకు ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చినట్లే కదా. మొన్న మహేష్ బాబు కూడా అంతే. తాను వంశీ పైడిపల్లితో చేస్తున్న సినిమాను ఎవరితో ప్రొడ్యూస్ చేయిస్తున్నాడో చెప్పాశాడు. ఆల్రెడీ వంశీపై పివిపి రెండు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో.. దిల్ రాజు అండ్ అశ్వినిదత్ కాంబినేషన్లో ఆ సినిమాను చేయబోతున్నట్లు మహేష్ కన్ఫామ్ చేస్తూ ట్వీట్లు వేశాడు.

మొత్తానికి దిల్ రాజు క్యాంపులో తదుపరి సినిమా చేస్తున్న మహేష్.. పివిపి కి వయా ట్విట్టర్ క్లారిటీ ఇస్తే.. పివిపితో కలసి రాజు గారి గది 2 సినిమా చేస్తున్న నాగార్జున దిల్ రాజుకు అదే ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చాడు. అది సంగతి.

,  ,  ,  ,