Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2015 12:16:46
facebook Twitter Googleplus
Photo

ధనుష్ ... తమిళ తెరపై యువ కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బక్కపల్చగా వున్నా తన బాడీలాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ .. సక్సెస్ ను సాధిస్తూ ముందుకి దూసుకుపోతున్నాడు. కథలో కొత్తదనం వుండాలి .. ఆ కొత్తదనంలో బలం ఉండాలనే కాన్సెప్టుతోనే ధనుష్ సినిమాలు చేస్తుంటాడు. అందుకే ఆయన సినిమా వస్తుందంటే యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తూ వుంటుంది. వాళ్లని అలరించడం కోసం 'విఐపి 2' సినిమా చేస్తోన్న ధనుష్, త్వరలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు.

ప్రభుసాల్మాన్ దర్శకుడిగా వ్యవహరించే ఈ చిత్రంలో, ఫైట్స్ హైలైట్స్ గా నిలవాల్సిన అవసరం వుందట. దాంతో ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ 'రోజర్ యుయాన్' ను ఎంపిక చేసుకున్నారు. బ్యాట్ మెన్ బిగిన్స్ .. ఎక్స్ మెన్ .. స్కై ఫాల్ వంటి హాలీవుడ్ చిత్రాలకి ఆయన ఫైట్స్ కంపోజ్ చేశాడు. అలాంటి రోజర్ ని ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించే విషయాల్లో ఇది మొదటిదిగా మారింది. ఇక మున్ముందు ధనుష్ మరెన్ని విశేషాలకు తెరతీయనున్నాడో ఏమో!

,  ,  ,  ,  ,