Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 11:16:28
facebook Twitter Googleplus
Photo

మామూలుగానే మంచి నటుడైన ఎన్టీఆర్.. నెగెటివ్ టచ్ ఉన్న జై పాత్రలో చెలరేగిపోయినట్లే ఉన్నాడని జై టీజర్ చూస్తే అర్థమైంది. మొన్నటిదాకా ఈ సినిమాపై ఓ మోస్తరుగా అంచనాలుండేవి కానీ.. ఈ టీజర్ చూశాక ఒక్కసారిగా సినిమాపై హైప్ పెరిగిపోయింది. అందరూ ఉత్కంఠగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారిప్పుడు.

హీరో పాత్ర టిపికిల్ గా ఉంటే ఆటోమేటిగ్గా అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకుముందు ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేశాడు. చారి పాత్ర సినిమా విడుదలకు ముందు నుంచే ప్రేక్షకుల్లో సినిమాపై ప్రత్యేక ఆసక్తి తీసుకొచ్చింది. సినిమాలో కూడా భలేగా హైలైట్ అయింది. ఆ పాత్రలో ఎన్టీఆర్ పంచిన వినోదం జనాలకు బాగా నచ్చింది. ఎన్నిసార్లు చూసుకున్నా ఆ ఎంటర్టైన్మెంట్ బోర్ కొట్టదంతే. ఆ తర్వాత ఊసరవెల్లి తో కూడా ఎన్టీఆర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది.

ఇప్పుడు మళ్లీ జై లవకుశ తో జనాల్లో తన పాత్ర విషయంలో క్యూరియాసిటీ తీసుకురాగలిగాడు తారక్. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ చేయడమే ఒక విశేషమైతే.. ఆ పాత్రకు వైకల్యం ఉండటం మరింత ప్రత్యేకం. ఎన్టీఆర్ లాంటి నటుడికి ఇలాంటి పాత్ర పడితే ఇక చెప్పేదేముంది? చెలరేగిపోతాడంతే. టీజర్ చూశాక జనాలకు ఇక కథతో పని లేదు.. సినిమా ఎలా ఉంటుందన్న దాంతో సంబంధం లేదు.. జై క్యారెక్టర్ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టేశారు.

ఈ పాత్ర అంచనాలకు తగ్గట్లు వినోదాన్నందిస్తే సినిమా ఎలా ఉన్నా సరే.. బాక్సాఫీస్ రేసులో గెలిచేయడం ఖాయం. నిజానికి బాబీతో ఎన్టీఆర్ సినిమా అన్నపుడు చాలామంది నిరాశ వ్యక్తం చేశారు. ఈ సినిమాపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. మరి ఎన్టీఆర్ ఏరికోరి ఈ సినిమానే ఎందుకు ఎంచుకున్నాడనదానికి జై టీజర్ రుజువుగా నిలిచింది.

,  ,  ,  ,  ,