Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2016 11:52:29
facebook Twitter Googleplus
Photo

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ మూవీ హైపర్. వరుసగా టీవీ ఛానల్స్ చుట్టేస్తూ.. ఒక్కో ఛానల్ లో ఒక్కో పాట చొప్పున రిలీజ్ చేస్తూ.. డిఫరెంట్ రూట్ లో ఆడియోను రిలీజ్ చేసి ప్రమోట్ చేసిన హైపర్ టీం.. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసింది. 14 రీల్స్ బ్యానర్ పై నిర్మించిన దూకుడు రిలీజ్ అయ్యి 5 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. హైపర్ ట్రైలర్ ని విడుదల చేసింది ఈ సంస్థ. టైటిల్ కి తగ్గట్లుగానే ప్రతీ ఫ్రేమ్ లోనూ హై పవర్ ఎనర్జీ కనిపించగా.. ప్రతీ విజువల్ లోనూ రిచ్ నెస్ ఆకట్టుకుంది.

తండ్రి సత్య రాజ్ ను విపరీతంగా.. అమ్మకంటే ఎక్కువగా ప్రేమించేసే కొడుకుగా రామ్ నటించాడు. మా నాన్న అంటే నాకు పిచ్చి అని చెప్పేసే కేరక్టర్ హీరోది. తనపై ప్రేమను కొంచెమైనా వేరే వాళ్లకు షిఫ్ట్ చేయమనే కోరుకునే తండ్రిగా సత్యరాజ్ ఆకట్టుకుంటాడు. హీరోయిన్ రాశిఖన్నా అందాల ఆరబోతలో పార్ట్ అని ట్రైలర్ లో చెప్పేశాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. రామ్ తో మీడియం బడ్జెట్ మూవీ తీసినా.. పిక్చరైజేషన్ విషయంలో ఎక్కడా 14 రీల్స్ సంస్థ రాజీపడలేదని ట్రైలర్ తోనే తెలిసిపోతోంది.

గిబ్రాన్ అందించిన పాటలు ఇప్పటికే సక్సెస్ కాగా.. ఇప్పుడు ట్రైలర్ లో వినిపించిన బీజీఎం అయితే ఇరగదీసేశాడు. బోలెడన్ని పాజిటివ్ వేవ్స్ మధ్య.. హైపర్ ఈ నెల 30న థియేటర్లలోకి వచ్చేస్తోంది.

,  ,  ,  ,  ,