Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Dec-2014 11:11:48
facebook Twitter Googleplus
Photo

శంకర్ రూపొందిస్తున్న 'ఐ' చిత్రం తమిళ వెర్షన్ ఆడియో వేడుక ఎప్పుడో జరిగిన విషయం విదితమే. అయితే, తెలుగు వెర్షన్ వేడుక మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడిక సినిమా నిర్మాణ కార్యక్రమాలు అన్నీ పూర్తయి, విడుదలకు సిద్ధమవుతుండడంతో తెలుగు ఆడియో వేడుకను ఈ నెల 30న హైదరాబాదులో గ్రాండుగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంచితే, ఈ చిత్రానికి మద్రాస్ సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇవ్వడంతో, రీ సెన్సార్ చేసి U సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా రివైజింగ్ కమిటీకి అప్పీల్ చేస్తున్నారు. జనవరి 9న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో విక్రం, ఎమీ జాక్సన్ జంటగా నటించారు.

,  ,  ,  ,  ,  ,