Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2016 15:33:02
facebook Twitter Googleplus
Photo

వరుణ్ తేజ్ ను లైన్లో పెడదామని నాగబాబు ఎంతగానో ట్రై చేస్తున్నాడు.కంచెతో క్రిష్ మంచి పేరు తెచ్చి ఇచ్చినప్పటికీ...తమ వాడికి మాస్ యాంగిల్ రాలేదని పూరి చేతిలో వరుణ్ ను పెట్టాడు. లోఫర్ గా పేరు తెచ్చుకుంటాడు అనుకుంటే... కూల్ హీరో టైటిల్ తో ఎక్కడ స్థిర పడిపోతాడో అనే భయాన్ని నాగబాబులో కలుగ జేశాడు. అయితే ఈలోపు శ్రీనువైట్ల.... చెర్రీకి ఇవ్వలేని హిట్ ను వరుణ్ కు ఇస్తానని మాట ఇవ్వడంతో మిస్టర్ ప్రాజెక్ట్ ను అతని చేతిలో పెట్టారు.

ఈనెల 21న స్పెయిన్ లో సెట్స్ పైకి వెల్తుందనుకున్న ఈ ప్రాజెక్ట్ ఇపుడు జూన్ కు వాయిదా పడింది.అది కూడా లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికే అని యూనిట్ చెబుతుంది. ఇదంతా భాగానే ఉంది కాని కుమారుడి విషయంలో నాగబాబుకు కావల్సిన ఇమేజ్ ను శ్రీనువైట్ల ఎంత వరకు తేగలడు అన్నదే ప్రశ్నగా మారింది. ఎందుకంటే శ్రీనువైట్ల తో సినిమా అంటే ఖచ్చితంగా కామెడీని ఎక్స్ పెక్ట్ చేస్తారు.

మరి ఈవిషయంలో వరుణ్ తేజ్ ఎంత వరకు నరుక్కొస్తాడనేది కొంత వరకు సందేహమే. ఎందుకంటే వరుణ్ లో కామెడీ యాంగిల్ అంతగా లేదనేది క్రిటిక్స్ చెబుతున్న మాట.ఇది ఒక్క వరుణ్ లోనే అని కాదు.అటు చరణ్ రానాలోను ఈ లోపం మనకు కనిపిస్తుంది. ఒకవేల అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తే మాత్రం నాగబాబు కోరికను తీర్చినవాడిగా శ్రీనువైట్ల మెగా అభిమానుల మద్దతు కూడగట్టుకోవడం ఖాయం

,  ,  ,  ,  ,