Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Dec-2014 18:29:55
facebook Twitter Googleplus
Photo

విక్రం హీరోగా శంకర్ రూపొందిస్తున్న 'ఐ' చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో పండుగను ఈ నెల 15న హైదరాబాదులో భారీగా నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ యాక్షన్ స్టార్ జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేసే ఈ వేడుక హైదరాబాదు శివారు గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. తెలుగు చిత్ర రంగం నుంచి మహేష్ బాబు హాజరవుతాడని అంటున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ చిత్ర నిర్మాణం ప్రస్తుతం చివరి అంకంలో వుంది. 150 కోట్ల బడ్జెట్టుతో దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో విక్రం సరసన ఎమీ జాక్సన్ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,