Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2015 13:50:09
facebook Twitter Googleplus
Photo

గోవా బ్యూటీ ఇలియానాకి వరుసగా బంపర్ ఆఫర్స్ తగులుతున్నాయి. బాలీవుడ్ కోసం పరుగులు పెట్టాక.. సౌత్ లో అంతగా అవకాశాలు రావడం లేదు. ఇక ఈ చిన్నదాన్ని మర్చిపోవడమే అనుకుంటున్న సమయంలో.. క్రేజీ ప్రాజెక్టుల్లో ఇల్లీబేబీ పేరు వినిపించడం అదృష్టమనే చెప్పాలి.

రీసెంట్ ఇలయదళపతి విజయ్ తన నెక్ట్స్ మూవీలో ఇలియానాతో రొమాన్స్ చేయాలని డిసైడ్ అయ్యాడట. గతంలో 3ఈడియట్స్ తమిళ్ రీమేక్ లో వీళ్లిద్దరూ కలిసి బాగానే సందడి చేశారు. వచ్చే ఏడాది స్టార్ట్ కానున్న ఈ మూవీకి.. తని ఒరువన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన మోహన్ రాజా డైరక్షన్ చేయనుండడం విశేషం. దీనికి ముందు గోవా బుల్ బుల్ పేరు చరణ్ పక్కన కూడా వినిపించింది. తని ఒరువన్ రీమేక్ లో చరణ్ ఇలియానా జంట ఖాయం చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే చెర్రీ ఈ విషయాన్ని అనౌన్స్ చేయలేదు ఇప్పటివరకూ. అయినా సరే ఫేడౌట్ అవుతుందే అనుకుంటున్న టైంలో.. ఇలా క్రేజీ ప్రాజెక్టుల్లో ఇలియానాని పరిశీలిస్తుండడం గొప్ప విషయమే.

ఈ రెండింటిలో ఏ ఒక్కటి సెట్ అయినా హిట్ అయినా.. మళ్లీ సౌత్ లో ఇలియానాకి టైం స్టార్ట్ అయినట్లే. కాకపోతే మరోసారి అమ్మడు తన తల బిరుసు చూపిస్తే మాత్రం ఇక్కడ మొత్తానికే మోసపోయే ఛాన్సు కూడా ఉంది మరి.

,  ,  ,