Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 10:11:37
facebook Twitter Googleplus
Photo

గోవా బ్యూటీ ఇలియానా యాక్టింగ్ లో బోలెడంత ఎక్స్ పీరియన్స్ సంపాదించేసింది. టాలీవుడ్ మూవీ దేవదాసుతో మొదలుపెట్టి పదేళ్ల నుంచి నాన్ స్టాప్ గా సినిమాలు చేసేస్తున్న ఇల్లీ బేబీ.. ఇప్పుడు బాలీవుడ్ లో చెలరేగిపోతోన్న సంగతి తెలిసిందే. చేస్తున్న సినిమాల సంఖ్య ఇక్కడితో పోలిస్తే తక్కువే అయినా.. వాటిలో హిట్టు రేషియో మాత్రం ఎక్కువగా ఉండడంతో అవకాశాలు బాగానే వస్తున్నాయి.

ప్రస్తుతం అర్జున్ కపూర్ తో కలిసి ముబారకన్ అనే మూవీ చేస్తోంది ఇల్లీ బేబీ. ఈ మూవీ కోసం చండీఘడ్ కు షూటింగ్ వెళుతున్న టీం.. ఇలియానాకు ఓ నోట్ పంపింది. కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తామని.. ఎప్పుడేం కావాలన్నా ఇబ్బంది పడకుండా అడగాలని.. సినిమా చక్కగా రావడానికి అందరి కలిసి ట్రై చేద్దామని.. చాలా సింపుల్ అండ్ స్పెషల్ గా ఆ లెటర్ లో మేటర్ ఉంటుంది. అంతేకాదు.. చండీగర్ సిటీలో చలి చాలా ఎక్కువగా ఉంది.. నీకు ఇష్టమైన మందు (ఆల్కహాల్) ఏంటో చెబితే.. ఆ బ్రాండుతో నీ రూమ్ లో ఉన్న మినీ బార్ అంతా నింపేస్తాం స్వీటి.. త్వరగా ఆ బ్రాండ్ పేరు చెప్పు. ఎప్పుడైనా స్టాక్ అయిపోతే మా మీద అరవొచ్చు పర్లేదు'' అంటూ ఆ లెటర్ లో ఉంది. ఈ నోట్ ను అభిమానులకు షేర్ చేసిన ఇలియానా.. అది చూడగానే సంతోషాన్ని కూడా పంచుకుంది.

నటిగా పదే్ల నా కెరీర్ లో నేను చాలా చూశాను. కానీ ఈ లవ్ లీ సింపుల్ నోట్ చూశాక.. నాకు ఏది ఇంపార్టెంట్ అనే విషయం అర్ధమైంది. ముబారక్ టీం.. యు గైస్ రాక్' అంటోంది ఇలియానా.

,  ,  ,  ,  ,