Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jan-2015 10:33:34
facebook Twitter Googleplus
Photo

ఆమధ్య తట్టాబుట్టా సర్దుకుని బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఇలియానా, ఆ తర్వాత మళ్లీ సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఎవరైనా వెళ్లి అడిగినా అమ్మడు దక్షిణాది సినిమాలు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఇల్లీ బ్యూటీ తాజాగా ఓ తమిళ చిత్రానికి సంతకం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ నటుడు ప్రశాంత్ హీరోగా అతని తండ్రి త్యాగరాజన్ నిర్మించే 'సాహసం' చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తుందట. రెండేళ్ల క్రితం తెలుగులో వచ్చిన 'జులాయి' చిత్రం ఆధారంగా ఈ 'సాహసం' రూపొందుతోంది. 'జులాయి'లో కూడా ఇలియానానే కథానాయికగా నటించిన సంగతి మనకు తెలిసిందే!

,  ,  ,  ,