Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 12:19:34
facebook Twitter Googleplus
Photo

ఇలియానా అంటే నిన్న మొన్నటిదాకా ఆడియన్స్ కే కాదు, కొందరు హీరోలకీ ఫేవరేట్. దాదాపు అందరు స్టార్స్ తో యాక్ట్ చేసి మంచి విజయాలు అందుకుంది ఈ అమ్మడు. మరి ఎందుకో కాని సడన్ గా ఇలియానా స్టార్ తిరగబడింది. టాలీవుడ్ లో ఆఫర్స్ డౌన్ అయ్యాయి. దాంతో ఇల్లీ బేబీ బాలీవుడ్ పై లుక్కేసింది. అంతే ! ముంబయ్ చెక్కేసింది. బట్ ? అక్కడా కలిసిరాలేదు.బాలీవుడ్ సరిగా రిసీవ్ చేసుకోకపోవడంతో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ ? అన్నట్టు టాలీవుడ్ పై కన్నేసింది. కొన్ని రోజులు ఏ ఛాన్సూ రాలేదు. చివరికి మహేష్ బాబుతో మళ్లీ యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ కు జోడీగా ఎవరైతే బాగుంటుందా?.. అని ఆలోచించి ఇల్లీ అయితే బాగుంటుందని మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ ఇల్లీ సైడై పోయిందట.ఇలియానా మహేష్ బాబుతో పోకిరిలో యాక్ట్ చేసి అదరగొట్టేసింది. అది గుర్తుకొచ్చి ఆమెను ఓకే చేద్దామనుకుంటే ఏకంగా రెండు కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. డిమాండ్ లేకపోయినా అంత రేట్ చెప్పేసరికి ? ఇలియానా ఎందుకులే అని పక్కన పెట్టారని టాక్. అత్యాశకు పోతే ఇలాగే అవుతుంది మరి.

,  ,  ,  ,