Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 09:49:24
facebook Twitter Googleplus
Photo

సినిమాను విడుదల చేయడానికి ముందు టీజర్.. ట్రైలర్లలో కొన్ని షాట్లు జనాలకు చూపించడం మామూలే. కానీ సినిమాలోని కీలకమైన పది నిమిషాల కంటెంట్ ను ముందే బయటికి వదిలేయడమంటే సాహసమే. తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోనీ ఇప్పటికే ఒకసారి ఈ సాహసం చేశాడు. గత ఏడాది బేతాళుడు సినిమాలో తొలి పది నిమిషాల సన్నివేశాల్ని మీడియాకు చూపించడమే కాక.. ఆన్ లైన్లోనూ రిలీజ్ చేశాడు విజయ్ ఆంటోనీ. అప్పట్లో అది సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ తీసుకొచ్చి ఓపెనింగ్స్ కు ఉపయోగపడింది. ఇప్పుడు తన కొత్త సినిమా అన్నాదురై విషయంలోనూ అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాడు విజయ్.

ఈ నెల 30న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అతను ఈ నెల 15న తమిళ ఆడియో విడుదల సందర్భంగా ప్రెస్ వాళ్లకు సినిమాలోని 10 నిమిషాల కీలకమైన కంటెంట్ చూపించబోతున్నాడు. ఆ తర్వాత ఆ కంటెంట్ ఆన్ లైన్లోనూ పెడతాడట. ఆపై తెలుగులోనూ ఇదే తీరులో చేయబోతున్నారు. జి.శ్రీనివాసన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్.. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుంది. సీనియర్ నటి.. నిర్మాత రాధిక.. విజయ్ ఆంటోనీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. గత నెలలో రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై బాగానే ఆసక్తి పెంచింది.

,  ,  ,  ,  ,  ,