Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Oct-2017 14:59:05
facebook Twitter Googleplus
Photo

ప్రియాంక చోప్రా.. హీరోయిన్ గా తన ప్రస్థానం ఆరంభించింది సౌత్ ఇండస్ట్రీలో అని చాలామందికి తెలియదు. ఆమె తెలుగులో అపురూపం అనే ఒక సినిమా చేసింది. అది విడుదలకే నోచుకోలేదు. దీంతో పాటుగా ప్రియాంక తమిళంలోనూ ఓ సినిమా చేసింది. ఆ సినిమా పేరు.. తమిళన్. అందులో విజయ్ కథానాయకుడు. ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి ఎదిగినా కూడా ఆమె ఈ సినిమా హీరోను మరిచిపోలేదు. విజయ్ అంటే తనకు చాలా ఇష్టమని.. అతడికి తాను పెద్ద ఫ్యాన్ అని.. ఇండియాలో తన ఫేవరెట్ హీరో విజయే అని ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

ఏడాదిగా హాలీవుడ్ కే పరిమితం అయినప్పటికీ తనను హాలీవుడ్ హీరోయిన్ అని జనాలు పిలవాలని కోరుకోనని ప్రియాంక చెప్పింది. తాను ఎప్పటికీ బాలీవుడ్ హీరోయినే అని చెప్పింది. ఇక తన డ్రెస్సింగ్ గురించి కామెంట్లు చేసేవాళ్లు గట్టిగా బదులిచ్చింది ప్రియాంక. సముద్రంలోకి దిగి స్విమ్ చేయాల్సినపుడు చీర కట్టుకుని దిగలేం కదా అని ఆమె ప్రశ్నించింది. ఎక్కడ ఏ డ్రెస్ సౌకర్యంగా ఉంటుందో అదే వేసుకుంటామని.. బీచ్ లో దిగినపుడు స్విమ్ సూట్లే వేయాలని ఆమె అంది. తన డ్రెస్సింగ్ గురించి కామెంట్లు చేసే వాళ్లను చూస్తే కోపంతో పాటు నవ్వు కూడా వస్తుందని ప్రియాంక అంది. ఓ మహిళ వస్త్రధారణపై నీచంగా కామెంట్లు చేసేవాళ్లు మారాల్సిన అవసరముందని.. వీళ్లంతా హుందాతనం అలవాటు చేసుకోవాలని ప్రియాంక హితవు పలికింది.

,  ,  ,  ,