Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jan-2015 10:46:34
facebook Twitter Googleplus
Photo

ఒకప్పటి ప్రముఖ కథానాయిక ఇంద్రజ, నేటి నటి మంచు లక్ష్మి కలసి నటించిన చిత్రం 'బుడుగు'. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇందులో బుడుగుగా టైటిల్ రోల్ ను మాస్టర్ ప్రేమ్ పోషించాడు. బన్నీ అనే ఎనిమిదేళ్ల కుర్రాడికి సంబంధించిన కథగా ఇది తెరకెక్కింది. బుడుగు, వాళ్ల అమ్మా నాన్న, చెల్లి, ట్రాయ్ అనే కుక్కపిల్ల చుట్టూ ఈ కథ నడుస్తుందని దర్శకుడు మన్మోహన్ చెప్పారు. కొన్ని యథార్థ సంఘటనలను కూడా ఈ కథలో మిళితం చేశామని అన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

,  ,  ,  ,  ,