Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2016 11:41:41
facebook Twitter Googleplus
Photo

హీరో విక్రమ్ గురించి తెలుగు, తమిళ సినీ అభిమానులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌతిండియన్ సినిమాలో పలు అద్భుతమైన ప్రయోగాలు చేసి, నటనపై తనకున్న మక్కువ చూపి అందరి మన్ననలూ పొందిన ఈ హీరో తాజాగా ఇరుముగన్ (తెలుగులో ?ఇంకొక్కడు?) సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌కాపీతో సెన్సార్‌కు సిద్ధమైంది. ఈ వారమే ఈ సినిమా తమిళ వర్షన్ సెన్సార్ పూర్తి కానుంది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సెప్టెంబర్ 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ రెండు విభిన్న పాత్రలతో అలరించనున్నారు. ముఖ్యంగా లవ్ అనే పాత్ర సినిమాకే హైలైట్‍గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. విక్రమ్ సరసన నయనతార, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు.

,  ,  ,  ,  ,