Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2016 15:24:59
facebook Twitter Googleplus
Photo

నిన్నట్నుంచి అందరూ సందేహిస్తున్నదే జరిగింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ వీకెండ్లో రావాల్సిన సినిమా వాయిదా పడింది. శనివారం రిలీజవ్వాల్సిన అల్లరి నరేష్ సినిమా ఇంట్లో దయ్యం నాకేం భయంను వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ప్రకటించాడు. ??నవంబర్ 12న విడుదల కావాల్సిన మా ?ఇంట్లో దెయ్యం నాకేం భయం? చిత్రాన్ని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం? అని ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు శుక్రవారం విడుదల కావాల్సిన నాగచైతన్య సినిమా ?సాహసం శ్వాసగా సాగిపో? మాత్రం యధావిధిగా వచ్చేస్తోంది.

మరోవైపు తమిళంలో గురువారం విడుదల కావాల్సిన సినిమా ?కడవుల్ ఇరుక్కా కుమారు? వాయిదా పడిపోయింది. జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వారం లేటుగా నవంబరు 17న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించాడు. 500.. 1000 నోట్ల రద్దు కారణంగా థియేటర్ల దగ్గర టికెట్ల కొనుగోళ్లు బాగా దెబ్బ తినడం.. నిర్మాతలు.. బయ్యర్లు.. ఎగ్జిబిటర్ల మధ్య లావాదేవీలు ఆగిపోవడంతో ఈ వారాంతం సినిమాల విడుదలకు ఇబ్బంది తలెత్తింది. వచ్చే వారం నిఖిల్ మూవీ ?ఎక్కడికి పోతావు చిన్నవాడా?తో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు బేతాళుడు.. ఒక్కడొచ్చాడు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ?ఇంట్లో దయ్యం నాకే భయం? సినిమాను వచ్చే వారం కూడా రిలీజ్ చేయడం కుదరదు. బహుశా ఈ చిత్రం నవంబరు 25న విడుదల కావచ్చని భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,