Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 12:03:32
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా కోసం ఆడియన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా సిని'మా' అవార్డ్ ఫంక్షన్ లో మెగాస్టార్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ చూశాక.. ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మరి ఈ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయేందుకు దర్శకుడు వివి వినాయక్ చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మెగా 150ని చరిత్రలో నిలిచిపోయేలా చేసేందుకు తనకు అవకాశం ఉన్న అన్ని ఆయుధాలను వాడుతున్నాడు వినాయక్. అందుకే ఇప్పుడు ముగ్గురు రైటర్లను బోర్డ్ లోకి తీసుకొచ్చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ ఈ మూవీకి రైటర్స్ గా ఉన్న విషయం తెలిసిందే. వీరు పొలిటికల్ డైలాగ్స్ కి సంబంధించిన వెర్షన్ ని ప్రిపేర్ చేస్తున్నారట. మెగాస్టార్ నోటి వెంట వచ్చే ఒకో పొలిటికల్ డైలాగ్.. పవర్ ఫుల్ గా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట ఈ సీనియర్ రైటర్స్.

ఇక సాయి మాధవ్ బుర్రాతో ఎమోషనల్ కంటెంట్ కి సంబంధించిన డైలాగ్స్ ని ప్రిపేర్ చేయిస్తున్నారని తెలుస్తోంది. వీరితో పాటు ఆకుల శివను కూడా రైటర్ గా తీసుకొచ్చేశారు. కామెడీ పంచ్ లు పేల్చడంలో దిట్ట అయిన ఆకుల శివ.. ఆ డిపార్ట్ మెంట్ వరకు చూసుకుంటున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోటి హ్యాండిల్ చేయడం సమంజసమే అయినా.. అన్నిటినీ సరిగ్గా సెట్ చేయకపోతే.. తేడా కొట్టేస్తుందేమో చిరు అంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,