Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2016 12:11:06
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నితిన్ నటించిన ?అ..ఆ..? సినిమా జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ?అ..ఆ..?పై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. తన కెరీర్‌కి ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని చెబుతోన్న నితిన్, సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అ..ఆ.. గురించి నితిన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, అ..ఆ.. సినిమాకు తనకెంతో ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా ఉండడం మరింత అదృష్టమని నితిన్ తెలిపారు.
ఇక ?అ..ఆ..? షూటింగ్ చివరి దశలో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ సెట్లో దర్శనమిచ్చి, టీమ్ మొత్తాన్నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ఆరోజు ఎళ్ళిపోకే శ్యామలా అనే పాట చిత్రీకరణ జరుగుతుందని, పవన్ ముందు ఒకటి, రెండు సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినపుడు భయమేసిందని నితిన్ అన్నారు. ఇక ఎలాగోలా అప్పటికి భయం పోగొట్టుకొని ఆ సీన్ చేసేశానని, పవన్ ముందు నటించడం మర్చిపోలేనని తెలిపారు. ఇక నితిన్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన అ..ఆ.. సినిమాను రాధాకృష్ణ నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,  ,