Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 11:40:18
facebook Twitter Googleplus
Photo

మన జగపతి బాబు ప్రస్తుతం సౌత్ ఇండియా అంతటా పాపులర్. ఈ ఏడాది ఒకేసారి తమిళ.. మలయాళ.. కన్నడ భాషల్లోనూ భారీ సినిమాలు చేశాడు జగపతి. కన్నడలో ఆయన ముఖ్య పాత్ర పోషించిన సినిమా ?జాగ్వార్?. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ కథానాయకుడిగా పరిచయమైన సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే కుమారస్వామికి బాగా క్లోజ్ అయిపోయిన జగపతి.. ఆయన నిర్మాణంలో తాను హీరోగా ఓ సినిమా చేయడానికి కూడా కమిటయ్యాడు. ఈ సినిమా గురించి ?జాగ్వార్? ప్రమోషన్లలో చెప్పినపుడు.. ఏదో మాట వరసకు అంటున్నాడేమో అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిజంగానే పట్టాలెక్కేస్తుండటం విశేషం.

కుమారస్వామికి చెందిన చెన్నాంబిక ఫిలిమ్స్ తో పాటు జగపతి సొంత నిర్మాణ సంస్థ ?జగపతి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను వాసు పరిమి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో జగపతి 60 ఏళ్ల పైబడ్డ వృద్ధుడిగా కనిపించబోతుండటం విశేషం. ఇందులో ఆయనకు కథానాయిక కూడా ఉండదట. ఒక సామాన్యుడు వ్యవస్థ మీద చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ?జగపతి పిక్చర్స్? సినిమాలు నిర్మించి చాలా కాలం అయిపోయింది. ఈ సంస్థను మళ్లీ మొదలుపెట్టాలని జగపతి తండ్రి రాజేంద్రప్రసాద్ ఆశపడ్డారు. కానీ ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. తండ్రి కోరికను నెరవేరుస్తూ ఇప్పుడు జగపతి తమ సంస్థపై మళ్లీ సినిమాలు మొదలుపెడుతున్నాడు.

,  ,  ,  ,