Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 11:27:40
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నేళ్లగానో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ఎదురుచూస్తుంటే... జనతా గ్యారేజ్ ఆ కోరికను తీర్చేసేట్లుగా కనిపిస్తోంది. చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులన్నీ ఎన్టీఆర్ ఖాతాలోకి వచ్చేస్తున్నాయి. ఇండస్ట్రీ టాప్-5లోకి జనతా గ్యారేజ్ ఎంట్రీ ఇప్పటికే ఖాయం అయిపోగా.. ఏ ప్లేస్ లో నిలుస్తుందన్నదే ఇప్పుడు పాయింట్.

తన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎంజాయ్మెంట్ ను అభిమానులతో సహా అందరితో పంచుకునేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ నెల 10 వైజాగ్ లో సక్సెస్ మీట్ ని ప్లాన్ చేసినా.. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. అయితే.. తన ఆనందాన్ని మరో రూపంలో పంచుకోవాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడట. మొత్తం జనతా గ్యారేజ్ టీమ్ మెంబర్లతో పాటు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లందరికీ హైద్రాబాద్ లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడని.. దీనికి ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది.

ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ కార్యక్రమం జరగనుండగా.. ముందు యూనిట్ తో సక్సెస్ మీట్ నిర్వహించి.. తర్వాత జనతా గ్యారేజ్ టీమ్ కోసం ఏర్పాటు చేసిన పార్టీకి అటెండ్ అవుతాడట యంగ్ టైగర్. గతంలో టెంపర్.. నాన్నకు ప్రేమతో చిత్రాల విజయాలను కూడా ఎన్టీఆర్ ఇలాగే ఎంజాయ్ చేశాడు.

,  ,  ,  ,  ,