Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2016 11:17:49
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు కొత్త కొత్త లుక్కులతో విలన్లందరూ మనకు కిక్కవ్వడం ఫ్యాషనే అయిపోయింది. వీళ్లందరిలో ఏజెడ్ విలన్ అంటే మన జగపతి బాబే. పైగా నెరిసిన గెడ్డాన్ని కూడా ఆయన చాలా క్లాసుగా వాడేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ లుక్ ఆయనకు సాంబార్ ల్యాండ్ లో ఎంతవరకు కలిసొస్తుంది అనేది అసలు విషయం.

విక్రమ్ హీరోగా హీరోయిన్ అమలా పాల్ మొగుడు ఏ.ఎల్.విజయ్ తీసిన 'తాండవం' సినిమాతో తొలిసారిగా విలనీ చూపించాడు జగపతి బాబు. ఆ సినిమాలో తన స్నేహితుడుని మోసం చేసే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంటుగా మనోడు కాసేపు అలరించాడు. కాకపోతే మరీ విక్రమ్ ప్రక్కన చేసేసరికి ఎవరైనా కూడా తేలిపోతారుగా.. అలా జగ్గూ టాలెంట్ ఎవ్వరికీ కనిపించకుండా పోయింది. ఆ తరువాత తెలుగులో 'లెజండ్' సినిమాతో ఫుల్ టైమ్ విలన్ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు హీరో విజయ్ 60వ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అక్కడ బాగా పాపులర్ అయిన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో మనకు తెలిసిన లెజెండ్ మరియు నాన్నకు ప్రేమతో టైపు లుక్కులోనే తమిళ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి సిద్దపడ్డాడు.

కొన్ని డిఫరెంట్ సినిమాల్లో కూడా నటిస్తున్న జగపతి బాబు.. తమిళంలో ఈ సినిమా హిట్టయితే మాత్రం కెరియర్ ను ఎక్కడికో పరిగెత్తించేసినట్లే.

,  ,  ,  ,  ,  ,