Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2016 12:08:12
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు తన హీరోగా ఉన్నప్పటికంటే.. ఇప్పుడు విలన్ మరియు ముఖ్యమైన క్యారెక్టర్ పాత్రలను చేస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉన్నానని అంటున్నాడు జగపతి బాబు. ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చాలా హ్యాపీగా ఉన్నాడట.

''మొన్నామధ్యన గోవా వెళ్లాను. నా పని పూర్తిచేసుకుని.. రోడ్డు మీద కూర్చొని సిగరెట్ కాల్చుకుంటున్నాను. ఒక 21 ఏళ్ళ అమ్మాయి వచ్చి.. 'యు ఆర్ సో హాట్' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. అంతకంటే ఏం కావాలి'' అంటూ తన లుక్ గురించి చెప్పాడు జగపతి బాబు. ''ఇజం'' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మనోడు ఈ కామెంట్లను చేశాడులే. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ''ఇప్పటివరకు నాకు కథ తెలియదు. నాకు కథ తెలిసేలోపు సినిమా షూటింగ్ అయిపోయింది. హీరో పాయింటాఫ్ వ్యూ మాత్రమే కాకుండా సినిమాను సినిమాగా చూస్తాడు జగన్. అన్ని క్యారక్టర్లు పండితేనే సినిమా హిట్టవుతుంది. జగన్ కూడా అదే నమ్ముతాడు. అందుకే అతని సినిమాలో కథ తెలియకపోయినా చేశాను. డబ్బింగ్ స్టూడియోలో నేను చేసిన సీన్లు చూస్తే బాగా వచ్చాయి. ఇక సెకండాఫ్ లో చివరి 30 నిమిషాలు సినిమా అదిరిపోయిందని అంటున్నారు'' అన్నాడు జగపతి.

అయితే అందరూ పూరి జగన్ తో అసలు సినిమ ఎందుకు చేస్తారంటే.. ''నేనైనా.. కళ్యాణ్ రామ్ అయినా.. మ్యూజిక్ డైరక్టర్ అయినా.. అందరికీ జగన్ మీద లవ్విజం. అందుకే తనతో ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తుంటాం. ఇదిగో నాకు ఇన్నాళ్ళకు కుదిరింది. ముందుగా ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ ను అనుకున్నాడు. కాని కళ్యాణ్ రామ్ చెప్పడం వలన నన్ను పెట్టుకున్నాడు'' అంటూ పూరి జగన్ ను ఇరకాటంలో పడేశాడులే జగ్గూ భాయ్. ఈ సినిమాలో మనోడు జావెద్ భాయ్ అనే డాన్ పాత్రను చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,