Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2016 11:24:23
facebook Twitter Googleplus
Photo

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కొద్దిరోజుల క్రితం ఓ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. చెన్నైలోని తన ఆఫీసులో కాలు జారి పడిపోయిన ఆయన, అప్పట్నుంచీ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక కమల్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని, ఇప్పటికీ వైద్యుల ఆధ్వర్యంలో ఆయన పూర్తి ఫిట్‌నెస్ కోసం చికిత్స పొందుతున్నారని తెలిసింది. దీంతో ఆయన మరోనెల పాటు షూటింగ్‌కు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసి విశ్రాంతి తీసుకోనున్నారు.
కమల్ హీరోగా నటిస్తూ ఉండడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న సినిమా ?శభాష్ నాయుడు? కొద్దినెలల క్రితమే సెట్స్‌పైకి వెళ్ళింది. ఈ నెలాఖర్లో ఆ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ మొదలుకావాల్సి ఉండగా, కమల్ ఆరోగ్యం కుదుటపడే వరకూ షెడ్యూల్ వాయిదా పడింది. టీమ్ వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్ నెలలో ఈ షెడ్యూల్ మొదలవుతుందని తెలిసింది. కమల్ హాసన్‌తో పాటు శృతి హాసన్, బ్రహ్మానందం ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది.

,  ,  ,  ,  ,  ,  ,