Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Sep-2016 11:15:16
facebook Twitter Googleplus
Photo

తన సెకండ్ ఇన్నింగ్స్ తో తెలుగుతెరకు ఈ మధ్యకాలంలో " లేటెస్ట్ తెలుగు స్టైలీష్ విలన్" లేని లోటును తీర్చేశాడు జగపతి బాబు. "లెజెండ్" సినిమాతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ము దులిపేస్తున్నారు. తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత నేమూ - ఫేమూ సంపాదిస్తున్నారు అని సినీ జనాలు అనుకుంటున్న దశలో... జగపతి బాబు వెనక్కి తిరిగిచూసుకోవడం లేదు. హీరోగా పీక్స్లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు జగపతి క్రేజ్ రెట్టింపైంది అంటే అతిశయోక్తి కాదేమో. ఈ రేంజ్ లో దూసుకుపోతున్న జగపతి బాబుకి ఈ దసరా ఫుల్ జోష్ తో జరగనుంది.

జగపతి అంటే ఒకప్పటి తెలుగు హీరో అవ్వొచ్చు కానీ ప్రస్తుతం మాత్రం ఆయన తెలుగు నటుడు కాదు. సౌత్ ఇండియా నటుడు! "వుడ్" తో సంబందం లేకుండా జగపతి దూసుకుపోతున్నాడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ?జాగ్వార్?లో జగపతే విలన్ అన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తమిళంలో విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.

అయితే.. ఈ దసరాకి జగపతి నటించిన మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. సుమారు రూ.75 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న జాగ్వార్ లో జగపతి స్టైలిష్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ చిత్రం దసరాకి విడుదల కాబోతుంది. ఇదే సమయంలో మోహన్ లాల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మలయాళ సినిమా "పులిమురుగన్" కూడా దసరాకే వస్తోంది. మొత్తానికి ఈ దసరా పండక్కి ఇటు తెలుగు - అటు కన్నడ - మలయాళ మూడు భాషల్లోనూ జగపతి తనదైన పాత్రలతో సందడి చేయబోతున్నాడన్నమాట!!

,  ,  ,  ,  ,  ,  ,