Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 11:20:25
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు ఒక సినిమాకు 50 కోట్లు అయ్యిందంటే.. అందులో నిజంగా సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి అయ్యిన ఖర్చు ఒక 15 కోట్లు కూడా ఉండదు. ఎందుకంటే తక్కినదంతా కూడా రెమ్యూనరేషన్లే. హీరోకు ఒక 10-15 కోట్లు.. దర్శకుడు 5-8 కోట్లు.. హీరోయిన్ 1 కోటి.. ఇతరులు అందరూ కలిపి మొత్తంగా ఒక 30 కోట్ల వరకు పేమెంట్లకే లేచిపోతోంది. ఒకవళ ఇలా వీరు అంతేసి తీసుకోకపోతే.. సినిమా ప్రొడక్షన్ ఖర్చు తగ్గిపోయి.. ప్రొడ్యూసర్లు ఎక్కువ సినిమాలే చేయొచ్చు. దీనిపై యంగ్ హీరో నాగచైతన్య ఏమంటున్నాడో తెలుసా?

అవును. హీరోల రెమ్యూనరేషన్ భారీగా ఉండటం కారణంగా నిర్మాతకు ఖర్చు భారం పెరుగుతుంది. అదే బాలీవుడ్ లో అయితే హీరోలందరూ కూడా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ లో పనిచేస్తున్నారు. మన దగ్గర కూడా అలాగే చేస్తే బాగుంటుంది. హీరోలు అందరూ ప్రాఫిట్ షేరింగ్ మెథడ్ లో పేమెంట్లు తీసుకుంటే.. చాలా మంచి సినిమాలు కూడా వచ్చ ఛాన్సుంది. ప్రయోగాలు కూడా చేయొచ్చు అంటూ సెలవిచ్చాడు చైతన్య. ఆల్రెడీ కొంతమంది హీరోలు ప్రాఫిట్ షేరింగ్ విధానంలోనే పనిచేస్తున్నారు.

,  ,  ,  ,  ,