Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Feb-2015 11:23:21
facebook Twitter Googleplus
Photo

హీరో వేషాలకు స్వస్తి చెప్పి, క్యారెక్టర్ యాక్టర్ గా మారినప్పటి నుంచీ జగపతిబాబు బిజీ అయిపోయాడు. ఆయన కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు క్రియేట్ చేస్తూ వస్తున్నారు. దీంతో పలు సినిమాలలో ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. అయితే, వచ్చిన ప్రతి ఆఫర్నీ ఆయన అంగీకరించడం లేదు. తనకు సంతృప్తి అనిపిస్తేనే చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ నటించే సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి జగపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఈయన ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. ఇది చాలా పవర్ ఫుల్ గా, నువ్వా? నేనా? అన్న రీతిలో సాగే పాత్రని అంటున్నారు. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది.

,  ,  ,  ,  ,  ,