Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 15:13:08
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో ఇప్పుడు ఏ స్టార్ హీరో మూవీలో అయినా సరే.. ఐటెం సాంగ్ అనగానే.. మొదట మిల్కీ బ్యూటీ పేరే వినిపిస్తోంది. అయితే.. తమ్మూ చేసినవి రెండే రెండు ఐటెం సాంగ్స్ అయినా.. ఇంతగా గుర్తింపు సంపాదించేసిందంటే.. ఏ రేంజ్ గుర్తింపు సాధించిందో అర్ధమవుతుంది.

'స్పెషల్ సాంగ్స్ లో నటిస్తే తప్పేంటి? వీటిలో డ్యాన్స్ చేయడం తప్పు కాదు కదా? పైగా అదో గౌరవం కూడా. అయినా బాలీవుడ్ లో కరీనా కపూర్ - కత్రినా కైఫ్ లాంటి టాప్ స్టార్స్ అందరూ చేస్తున్నారు. వాటికి బోలెడంత ఆదరణ లభిస్తోంది. మన దగ్గర మాత్రం ఐటెం సాంగ్స్ అంటే అదో చిన్నచూపు ఐపోయింది. కమర్షియల్ మూవీస్ లో డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. తమన్నా సూపర్ గా డ్యాన్స్ చేసింది అని ప్రూవ్ చేసుకునే ఏ అవకాశం నేను వదిలిపెట్టను' అంటూ ఐటెం సాంగ్స్ పై పెద్ద క్లాస్ నే పీకింది తమన్నా.

అల్లుడు శీను - స్పీడున్నోడు తర్వాత.. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో కూడా తమన్నా ఐటెం సాంగ్ చేస్తోందని అంటున్నారు కానీ.. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

,  ,  ,  ,  ,  ,