Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2017 12:05:51
facebook Twitter Googleplus
Photo

సినిమా సెట్స్ మీదికి వెళ్లిన నెల రోజులకే టైటిల్ లోగో లాంచ్ చేసి నందమూరి అభిమానులకు వినోదం పంచింది జై లవ కుశ టీం. ఆ తర్వాత గత నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఒకటికి రెండు ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక అప్పట్నుంచి జై లవకుశ టీజర్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్. రంజాన్ కానుకగా ఈ చిత్ర టీజర్ వస్తుందంటూ కొన్ని రోజుల కిందట గట్టి ప్రచారం జరిగింది. కానీ టీజర్ అనుకున్న సమయానికి రెడీ కావట్లేదా.. లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా తెలియదు కానీ.. రంజాన్ కానుకగా జై లవకుశ టీజర్ అయితే రావట్లేదు.

ఐతే అభిమానులు నిరాశ చెందుకుండా జై లవకుశ టీజర్ ఎప్పుడొస్తుందన్నది అధికారికంగా ప్రకటించి కొంచెం ఉపశమనం ఇచ్చింది ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ. జులై తొలి వారంలో జై లవకుశ టీజర్ వస్తుందని.. ఆ సంస్థ ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించారు. టీజర్ లాంచ్ డేట్.. టైమింగ్ ఏంటన్నది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కాబట్టి నందమూరి అభిమానులు ఇంకో రెండు వారాలు ఓపిక పట్టాలన్నమాట. పవర్.. సర్దార్ గబ్బర్ సింగ్ ల తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా జై లవకుశ. సర్దార్.. వల్ల అనవసరంగా అపప్రద మూటగట్టుకున్న నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు తనేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు బాబీ. ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం.

,  ,  ,  ,  ,