Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2017 10:56:50
facebook Twitter Googleplus
Photo

సినిమాను సెప్టెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసేస్తున్నాడు కళ్యాణ్ రామ్. తమ్ముడితో తొలిసారి తీసిన సినిమాతో ఆల్రెడీ అభిమానులకు ఆనందం.. తమ్ముడికి నేషనల్ అవార్డ్ గ్యారంటీ అంటూ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది కాని.. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ తోనే.. సినిమాపై అంచనాలు మారిపోతున్నాయి.

బుధవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జై లవ కుశ.. యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో బీభత్సమైన గ్లామర్ దారబోసినా కూడా సినిమాకు యు సర్టిఫికేట్ వచ్చేస్తోంది కాబట్టి.. సినిమాలోని రక్తపాతం కారణంగానే ఇప్పుడు యు/ఎ ఇచ్చారా అనే సందేహం వస్తోంది. అయితే ఈ సినిమాకు ఒక హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అతను ఈ సినిమాలో ఏం చేశాడో కనీసం ఒక్క పోస్టర్లో కూడా చూపించలేదు. కాని అతను చేసిన స్పెషల్ మేకప్ కారణంగా సినిమాకు యు/ఎ వచ్చిందట. అంటూ ఎన్టీఆర్ ను కొన్ని సీన్లలో అలా వికృతంగా చూపించేశారని టాక్. మరి ఫ్యాన్స్అలా చూసి తట్టుకోగలరా?

ఆ మధ్యన వచ్చిన ఐ సినిమా నిజానికి టివిలో చూస్తే చాలా బాగుంటుంది. కాని విక్రమ్ వంటి హ్యాండ్సమ్ స్టార్ను ఆయన అభిమానులు కూడా ఆ తరహాలో చూడలేకపోయారు. ఎంత మంచి నటుడైనా కూడా.. మరీ దారుణంగా ఒళ్లంతా ఏదో వచ్చినట్లు చూపిస్తే వారికి భయం వేసింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా అందుకే ఫ్లాపైంది

,  ,  ,  ,  ,