Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2015 13:20:44
facebook Twitter Googleplus
Photo

అఖిల్ స్టామినా ఎంత అని ఆలోచించాల్సిన అవసరం లేదనే విషయం కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు థింక్ చేయాల్సింది ఏంటంటే.. అఖిల్ సృష్టించబోతున్న రికార్డులు ఎన్ని అనే. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో కానీ.. నాగార్జునకు అసలేమాత్రం లేవు. ఎందుకంటే నాగచైతన్య విషయంలో జరిగిన మిస్టేక్స్ మళ్లీ జరక్కుండా.. చాలా అలర్ట్ గా అన్నీ చూసుకున్నాడు నాగ్. అందుకే ఇప్పుడంత కాన్ఫిడెన్స్ అనిపిస్తోంది.

రీసెంట్ గా ఇండస్ట్రీలో కొందరు ప్రొడ్యూసర్స్ కు అఖిల్ మూవీని స్పెషల్ గా చూపించాడట నాగ్. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సాంగ్ చూసి అందరూ మైండ్స్ బ్లాంక్ అయిపోయాయని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఏ డెబ్యూ హీరో చేయని రేంజ్ డ్యాన్సులతో ఫ్లోర్లు దద్దరిల్లిపోయాయని టాక్ వినిపిస్తోంది. మిగిలిన పాటలు ఫైట్స్ విషయంలో కూడా వినాయక్ మార్క్ ని ప్రతిబింబించేలా ఉన్నాయట. మూవీ డ్యురేషన్ విషయంలోనూ నాగ్ కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. రెండున్నర గంటలకు పైగా ఉన్న సినిమాని.. బాగా కత్తిరించి 2గంటల 5 నిమిషాలకు తెచ్చాడట. దీంతో మూవీలో ఎక్కడా ల్యాగ్ అనే మాటకు స్పేస్ లేకుండా పోయిందని టాక్.

స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ అంతా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో అఖిల్ ఆకట్టుకోనున్నాడని ఫిక్స్ అయిపోవచ్చు. దసరా సంబరాలు మిస్ అయినా.. దీపావళికి డబుల్ ఎనర్జీతో వచ్చేస్తున్నాడు అక్కినేని అఖిల్.

,  ,  ,