Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Aug-2016 14:22:48
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ?జనతా గ్యారేజ్? చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు వెళ్ళింది. మొదటి కాపీ చూసిన సెన్సార్ సభ్యులు సూపర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కితాబు ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చాల బాగుందని ఓ కొత్త ఎన్టీఆర్ ను ప్రేక్షకులు చూడబోతున్నారని , ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు అయితే జనతా మరో ఎత్తు అని సెన్సార్ వారు చెప్పడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి కట్స్ లేకుండా నీటుగా ఉందని తెలుస్తుంది. ఫస్ట్ కాపీ కి అమేజింగ్ రెస్పాన్స్ రావడం తో , డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ గా ఉన్నారు. బ్లాక్స్ బస్టర్ కావడంలో ఎలాంటి డౌట్ లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ కెరీర్ లోనే ఈ సినిమా అధిక వసూళ్లు సాధిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం అవసరం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో పూర్తి సెన్సార్ సర్టిఫికెట్ రాబోతుంది..అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.

,  ,  ,  ,  ,