Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2016 14:20:08
facebook Twitter Googleplus
Photo

రొటీన్ కి భిన్నంగా ఉన్న పాత్రలను ఎంచుకోవడంలో ఎన్టీఆర్ ఈ మధ్య బాగానే జాగ్రత్త పడుతున్నాడు. అదే కోవలో జనతా గ్యారేజ్ చేశాడు. అత్యంత భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గత గురువారం విడుదలైంది. ఓవర్ సీస్ లో కూడా జనతా రికార్డుల మోత మోగిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అమెరికాలో ఒకటిన్నర మిలియన్ డాలర్ల మార్కును దాటేసిన తారక్.. వరుసగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టంలో ఓ కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. టెంపర్ - నాన్నకు ప్రేమతో తరువాత ఇప్పుడు జనతా గ్యారేజ్ కూడా అమెరికాలో భారీ కలెక్షన్లు రాబడుతూ హ్యాట్రిక్ కొట్టింది.

ఇక జనతా గ్యారేజ్ ఐదురోజుల షేర్స్ వివరాలు ఇలా ఉన్నాయి...

ఏరియా - షేర్స్ (కోట్లలో)

నైజాం - 13.44
సీడెడ్ - 7.56
వైజాగ్ - 4.73
తూర్పు గోదావరి - 3.56
పశ్చిమ గోదావరి - 3.05
కృష్ణా - 3.27
గుంటూరు - 4.37
నెల్లూరు - 1.50

మొత్తంగా ఏపీ / నైజాం కలిసి - 41.47 కోట్ల షేర్ వ్యాల్యూ సాధించింది. మొత్తం మీద సుమారు 57 కోట్లతో తొలి ఐదురోజుల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది జనతా గ్యారేజ్.

* అమెరికాలో జయహో జనతా:

మిలియన్ డాలర్ల వసూళ్ల క్లబ్ ఇప్పటికే నాలుగు చిత్రాలతో తారక్ దూసుకుపోతున్నాడు. విడుదలై ఒక వారం కూడా దాటక ముందే అమెరికాలో వసూళ్ల రికార్డులు సృష్టిస్తున్నాడు. మరో వారంలో పరిస్థితి ఇలానే కొనసాగితే కలెక్షన్లపరంగా తారక్ బాక్సాఫీస్ టాపర్ గా అవతరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నిటికీ మించి తన రొటీన్ మాస్ మసాలా చట్రం నుంచి బయటకి వచ్చి కొత్త తరహా సబ్జెక్టులను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ ఉండటంతో ఓవర్ సీస్ అభిమానులకు ఎంతగానో నచ్చేస్తున్నాడు తారక్. ఈ ఏడాది ఇప్పటివరకూ అమెరికాలో విడుదలైన తెలుగు చిత్రాల్లో ?అ..ఆ..? రూ. 16.37 కోట్లు రాబట్టి నంబర్ 1 ప్లేసులో ఉండగా.. తరువాతి స్థానంలో తారక్ చిత్రం ?నాన్నకు ప్రేమతో? రూ. 13.43 కోట్లు కలెక్ట్ చేసింది. నిన్నటివరకూ మూడో స్థానంలో రూ. 10.45 కోట్ల వసూళ్లతో ?ఊపిరి? ఉడగా.. నాలుగో స్థానంలో ?జనతా గ్యారేజ్? 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఐదోరోజుకు వచ్చేటప్పటికి మాత్రం మూడోస్థానంలో ఉన్న ఊపిరిని దాటి ప్రస్తుతం మూడోస్థానంలోకి వచ్చేసింది. సినిమా విడుదలైన వారం రోజుల లోపే ఒకటిన్నర మిలియన్ డాలర్లు దాటేసిందంటే... మరో రెండువారాల్లో ఈ ఏడాది అమెరికాలో టాప్ గ్రాసర్ గా నంబర్ వన్ స్థానంలోకి వెళ్లిపోతుందని ఆశిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,