Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2016 11:16:30
facebook Twitter Googleplus
Photo

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా - కొరటాల శివ దర్శకత్వంలో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించి భారీ అంచనాల మధ్య విడుదలైన జనతాగ్యారేజ్... పరిస్థితులకు టాక్ కు ఏమాత్రం సంబంధం లేకుండా దూసుకుపోతుంది. ఇండియాలోనూ ఓవర్ సీస్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అతితక్కువ రోజుల్లోనే 50 కోట్లు వసూళ్లు రాబట్టుకుని ఇప్పటికే రికార్డు సృష్టించిన జనతా గ్యారేజ్.. తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ రేంజ్ లో దూసుకుపోతున్న సినిమా వందకోట్ల క్లబ్ లో చేరుతుందా? ఈ విషయంపై ఇప్పుడు చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

ప్రస్తుతం జనతా గ్యారేజ్ హవా బాక్సాఫీసు వద్ద ఎదురులేకుండా సాగుతుంది. ఈ ఊపు మరో వారం రోజులు కొనసాగితే జూనియర్ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరిపోవచ్చని టాక్ వినిపిస్తుంది. ఇప్పట్లో తెలుగు స్టార్స్ మూవీస్ ఏమీ లేకపోవడం కాస్త సపోర్ట్ చేసే విషయమే అయినా... విక్రమ్ హీరోగా నటించిన ఇంకొక్కడు సినిమా ఒక్కటే విడుదలకాబోతుంది. దీంతో ఈ ఒక్క సినిమావల్ల గ్యారేజ్ కు వచ్చిన ప్రమాదమేమి పెద్దగా లేదనే అనుకోవాలి. ఈ సమయంలో 100 కోట్లు కచ్ఛితంగా రాబడుతుందని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నా... జనతాకు ఈ సమయంలో భారీ శత్రువు ఏదైనా ఉందంటే అది కచ్చితంగా పైరసీ అనే చెప్పాలి. పైరసీ నియంత్రణకు ఎన్నిచర్యలు తీసుకున్నా కొన్ని వెబ్ సైట్లు మాత్రం ఈ విషయంలో తమ రాక్షస ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో పైరసీ విషయంలో సినిమా జనాలు - జూనియర్ అభిమానులు - సినిమా అభిమానులు కాస్త స్ట్రిక్ట్ గా ఉంటే మాత్రం ఈ సినిమా 100కోట్లు సాధించడం జరుగుతుందని ఇండస్ట్రీ టాక్

,  ,  ,  ,  ,