Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2017 12:52:26
facebook Twitter Googleplus
Photo

మేడ మీద అబ్బాయి అంటూ ఒక మలయాళ రీమేక్ తో వస్తున్నాడు అల్లరి నరేష్. అసలే ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ ఏ సినిమా చేసినా కూడా ప్లాపే కావడంతో అందరికీ మనోడికి మీద అంచనాలు తగ్గిపోయాయ్. పైగా ఇతగాడి మార్కు కామెడీ ఇప్పుడు జబర్ దస్త వంటి టివి షోల్లో రోజూ చేసేస్తున్నారు కాబట్టి.. ఈ సినిమా మీద కూడా అంచనాలు లేవు. కాని అందుకేనేమో ఇప్పుడు ఈ టీజర్ బాగా ఎక్కేస్తోంది.

ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసినప్పటికీ.. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా కథలు రాసుకుని హీరోలకు చెప్పి డైరక్టర్ అయిపోయి బాగా డబ్బులు సంపాదించుకోవాలనుకునే ఒక హీరో. అయితే ఇతగాడికి రాసిన సింపుల్ డైలాగులు.. అతి లేకుండా జస్ట్ హ్యూమర్.. షాన్ రెహ్మాన్ అందించిన సంగీతం.. చాలా బాగా సెట్టయ్యాయ్. హీరోయిన్ నిఖిల చూడ్డానికి సింపుల్ గా బాగుంది. అలాగే హ్యూమర్ పండిస్తున్న ఇతర నటీనటులు కూడా భలే సెట్టయ్యారు. ఇక గోవాలో తీసిన సాంగ్ విజువల్స్.. చివర్లో మనోడు వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ చూసి రామ్ గోపాల్ వర్మ ఏం కామెంట్ పెడతాడబ్బా అంటూ నరేష్ చెప్పడం.. ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి.

అసలు నరేష్ టైమింగ్ అమోఘం. అలాంటి నటుడు కాస్త ఫీల్ గుడ్ స్టోరీలను ఎంచుకుని.. సింపుల్ హ్యూమర్ తో సినిమాలు చేస్తే.. ఖచ్చితంగా నాని తరహాలో హిట్లు కొట్టేసుకోవచ్చు. చూస్తుంటే ఈ మేడ మీద అబ్బాయి ఆ పని చేసేలా ఉన్నాడు. మలయాళ మూవి ఒరు వడక్కన్ సెల్ఫీ కి ఇది రీమేక్.

,  ,  ,  ,