Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2016 11:24:13
facebook Twitter Googleplus
Photo

జనతా గ్యారేజ్? కలెక్షన్ల విషయంలో చాలా హ్యాపీగా ఉంది టీమ్ అంతా. ఇప్పటికే టీమ్ సభ్యులు సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. ఐతే అభిమానులతోనూ ఆ ఆనందాన్ని పంచుకుందామని భావించింది ఎన్టీఆర్ అండ్ కో. ఇది ఒకరకంగా ప్రమోషన్ కు కూడా పనికొస్తుందని భావించింది. ఆడియో వేడుక హైదరాబాద్ లో చేశారు కాబట్టి.. సక్సెస్ మీట్ కు ఏపీలోని విశాఖ నగరాన్ని వేదికగా ఎంచుకున్నారు. కానీ ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ముందు ఈ వేడుకను తొమ్మిదో తారీఖు చేయాలనుకున్నారు. ఐతే అదే రోజు కాకినాడలో పవన్ కళ్యాణ్ సభ ఉండటంతో మరుసటి రోజుకు వేడుకను వాయిదా వేయాలనుకున్నారు.

ఐతే విశాఖపట్నంలో వరుసగా కొన్ని రోజుల పాటు నిమజ్జన హడావుడి ఉంటుందని.. భద్రత ఏర్పాట్లు చేయడం కష్టమని పోలీసులు చెప్పడంతో ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి సిద్ధపడ్డట్లు సమాచారం అందుతోంది. ?జనతా గ్యారేజ్? బెనిఫిట్ షోల విషయంలో ఇబ్బందులు ఎదురవడం అప్పట్లో చర్చనీయాంశమైంది... చివరికి బెనిఫిట్ షోల విషయంలో ఇబ్బందులు తొలగిపోయినా.. ఇప్పుడు సక్సెస్ మీట్ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. గణేష్ నిమజ్జనం హడావుడి నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కష్టమన్న ఉద్దేశంతో ఈ వేడుకను రద్దు చేసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,