Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Oct-2016 11:26:36
facebook Twitter Googleplus
Photo

కమెడియన్ కం హీరో సునీల్ ఇప్పుడు రీమేకుల రాజా అయిపోయేట్లుగా ఉన్నాడు. పక్క భాషల్లో హిట్లు సాధించిన సినిమాలకు సునీల్ నే ఫస్ట్ ఆప్షన్ గా తీసుకుంటున్నారు టాలీవుడ్ మేకర్స్. గతంలో ఇలాంటి ఆఫర్స్ ముందుంగా వెంకీ చేతికి వచ్చేవి కానీ.. ఏజ్ పరంగా చూసుకుంటే యంగ్ రోల్స్ కి సునీల్ నే ఎంచుకుంటున్నారు.

ఇప్పటికే మలయాళ మూవీ 2 కంట్రీస్ ను తెలుగులో తీసుకునేందుకు సునీల్ ను తీసుకుని.. తరువాత క్యాన్సిల్ చేశారు. అయితే ఆ రీమేక్ పోయినా.. ఇప్పుడు ఒక తమిళ రీమేక్ సునీల్ ఖాతాలో పడేలా ఉంది. కంపోజర్ కం యాక్టర్ అయిన జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన 'ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు' అనే సినిమాని తెలుగులోకి తెచ్చేందుకు.. నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ ప్రయత్నిస్తోంది. జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి.. తెలుగు టైటిల్ ని కచ్చితంగా 'నాకు ఇంకో పేరుంది' అనే పెడతారని భావించచ్చు.

బాషా సినిమాలో రజినీ చెప్పిన సూపర్ హిట్ డైలాగ్.. 'ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు'. తెలుగు బాషాలో ఇది 'నాకు ఇంకో పేరు ఉంది' అని ఉంటుంది. సో.. తమిళ్ తో సమానంగా తెలుగులో కూడా రజినీకి క్రేజ్ ఉంటుంది కాబట్టి.. ప్రాజెక్టు ఫైనల్ అయితే.. ఈ కామెడీ సినిమాకి అదే టైటిల్ ని వాడేయచ్చు

,  ,  ,  ,  ,