Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2017 11:22:02
facebook Twitter Googleplus
Photo

ట్రైలర్ లాంటి పదాలకు అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఈ మధ్యే స్టంపర్ అనే పదం ఒకటి పరిచయమైంది. టీజర్ కా బాప్..ట్రైలర్ కా బేటా అంటూ టీజర్-ట్రైలర్ రెంటికీ మధ్య ఉండేలా స్టంపర్ ను రిలీజ్ చేసింది పైసా వసూల్ టీం. అది బాలయ్య అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు జవాన్ టీం ప్రెల్యూడ్ అనే కొత్త విశేషంతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.

సాయంత్రం 5 గంటలకు జవాన్ ప్రెల్యూడ్ రిలీజవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రెల్యూడ్ అంటే పల్లవి అని.. అర్థం. అంటే సినిమాకు సంబంధించి ఒక ఇంట్రో తరహాలో ఇది ఉండొచ్చేమో. టీజర్.. ట్రైలర్ లాంటి పదాలు రొటీన్ అయిపోయిన నేపథ్యంలో జనాల దృష్టిని ఆకర్షించడానికి ఇలా కొత్త కొత్త పదాలతో వస్తున్నారన్నమాట టాలీవుడ్ జనాలు.

జవాన్ ప్రెల్యూడ్ గురించి ప్రకటిస్తూ ఒక ఆసక్తికర పోస్టర్ లాంచ్ చేసింది చిత్ర బృందం. ఓవైపు చదరంగంలో రాజును జరుపుతున్నట్లు చూపిస్తూ.. మరోవైపు సాయిధరమ్ ఆందోళనగా పరుగెత్తుతున్నట్లు ఈ పోస్టర్లో చూపించారు. జై (హీరో) పాన్ అవుతాడా.. కింగ్ అవుతాడా? జులై 31న గేమ్ మొదలవుతుంది అంటూ ఈ ప్రెల్యూడ్ కు సంబంధించిన ఇంట్రో ఇచ్చాడు హీరో సాయిధరమ్ తేజ్.

,  ,  ,  ,